జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో 100% హెచ్‌పివి టీకా లక్ష్యంతో, గ్రామ సర్పంచ్ గూడూరు రజిని ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 14 ఏళ్ల బాలికలకు హెచ్‌పివి టీకాలు వేయించేందుకు చర్యలు చేపట్టారు. అర్హత గల ప్రతి బాలికకు ఆరోగ్య రక్షణ కోసం టీకా తీసుకోవాలని అవగాహన కల్పించారు. ప్రజల ఆరోగ్యం కోసం ఈ ముందడుగును వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు అభినందించారు.