పర్యావరణాన్ని, వైద్యులను గౌరవించడం మన బాధ్యత..మైలారపు లింబాద్రి

168చూసినవారు
పర్యావరణాన్ని, వైద్యులను గౌరవించడం మన బాధ్యత..మైలారపు లింబాద్రి
జగిత్యాల జిల్లా, కోరుట్ల, జగిత్యాలలోని మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో బుధవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. డాక్టర్స్ డే సందర్భంగా మెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి మాట్లాడుతూ పర్యావరణాన్ని, వైద్యులను గౌరవించడం మన బాధ్యత అని అన్నారు. వైద్యులను శాలువాలు, మెమోంటోలతో సత్కరించి, వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, ప్రధాన వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్