మెట్ పల్లి మండలం జగ్గసాగర్ గ్రామంలో ఈ నెల 30న రాత్రి ఐదు దేవాలయాల్లో దొంగతనం జరిగింది. కొండ స్వామి గుడిలో శ్రీ వారి కోరే మీసాలు, పట్టి నామాలు, బ్రహ్మేంద్రస్వామి ఆలయంలో 2000 రూపాయలు, రామాలయం గుడిలో 5000 రూపాయలు, గంగమ్మ గుడిలో హుండి పగలగొట్టి 2000 రూపాయలు, పెద్దమ్మ గుడిలో అమ్మవారి ఐదు గ్రాముల బంగారు చైన్ ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. జగ్గసాగర్ సర్పంచ్ పుల్ల సాయి గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.