పైడిమడుగులో జయశంకర్ జయంతి వేడుకలు

0చూసినవారు
పైడిమడుగులో జయశంకర్  జయంతి వేడుకలు
జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన సేవలు, త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తి చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శ్రీనివాస్, సర్పంచ్ బడుగు భూమేశ్వర్, ఉప సర్పంచ్ గాంధారి సుజాత శ్రీనివాస్, వార్డు సభ్యులు తురగా సంజీవ్, దొమ్మటి రాము గౌడ్, తోకల ప్రవీణ్, గంగాధర్, మమత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్