కోరుట్ల మండలంలోని బండాలింగాపూర్ గడి ప్రాంగణంలో 11వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కరాటే మాస్టర్ ప్రవీణ్ కుమార్, విద్యార్థుల సమక్షంలో యోగాసనాలు చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ, యోగాసనాలు, కరాటే సాధన ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని విద్యార్థులకు సూచించారు.