కరీంనగర్ జిల్లా రెవెన్యూ గార్డెన్‌లో జరిగిన 3వ రాష్ట్ర స్థాయి కుంగ్ ఫూ కరాటే ఛాంపియన్‌షిప్ 2025 పోటీలలో జగిత్యాల జిల్లాకు చెందిన 20 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంకు చెందిన సాయి తేజ, రిశ్వంత్ కటాస్ విభాగంలో బంగారు పతకాలు సాధించారు. ఈ టోర్నమెంట్‌లో వివిధ జిల్లాల నుండి 400 మంది విద్యార్థులు పాల్గొన్నారని జిల్లా ప్రధాన కరాటే శిక్షకులు మాస్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, గ్రాండ్ మాస్టర్ రాజమల్లు, టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ శ్రీనివాస్ వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.