
రేపే బీహార్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాల్లో గురువారం ఓటింగ్ జరగనుంది. ఈ దశలో మొత్తం 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కేబినెట్లోని 16 మంది మంత్రులు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ వంటి ప్రముఖుల భవితవ్యం తేలనుంది. మంగళవారం సాయంత్రంతో ప్రచారం ముగియడంతో అందరి దృష్టి పోలింగ్‌పైనే కేంద్రీకృతమైంది.




