మెట్‌పల్లి పట్టణంలో సోమవారం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా మెట్‌పల్లి పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలదండ వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పాత బస్టాండ్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ధ్యావనపల్లి రాజారాం, కేసుల సురేందర్, ఆనంద్, నాగరాజు, బేతు భాస్కర్, ధర్మపురి వేణుగోపాల్, గజం రవి, గౌతం, భీమనాతి సత్యం, సుధాకర్, జగదీశ్వర్ తో పాటు పలువురు పద్మశాలిలు పాల్గొన్నారు.