కోరుట్ల: వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు

69చూసినవారు
కోరుట్ల: వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు
కోరుట్ల పట్టణంలోని సాయి రామ దేవాలయంలో గురువారం గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రత్యేకంగా పాల్గొని బాబా వారికి అభిషేకము, అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పక్షాన ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఎమ్మెల్యే చేతుల మీద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.