ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం ఎమ్మెల్యే డా. సంజయ్ 30 మంది లబ్ధిదారులకు రూ. 9,11,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. అనంతరం కోరుట్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల పట్టణ, మండలాలకు చెందిన 93 మంది లబ్ధిదారులకు రూ. 26,38,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.