ఆర్థిక సంవత్సరం చివరి రోజు, మార్చి 31న, కోరుట్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆస్తి పన్ను వసూళ్లకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ కౌంటర్లకు పట్టణ ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఉదయం 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మొత్తం ఆరు లక్షల రూపాయల ఆస్తి పన్ను వసూలు అయినట్లు మున్సిపల్ కమిషనర్ రవీందర్ గౌడ్ తెలిపారు. సకాలంలో పన్నులు చెల్లించిన ప్రజలకు మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్ కృతజ్ఞతలు తెలిపారు.