వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ బుధవారం ఇబ్రహీంపట్నం మండలంలోని గోదూరు, తిమ్మాపూర్ తాండ గ్రామాల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం సకాలంలో మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఆలస్యం లేకుండా తూకం వేసి తరలించాలని సూచించారు.