మెట్‌పల్లి పట్టణంలోని 14 వార్డు బోయవాడలో ఆదివారం హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపంలో కాలనీ మహిళలు కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు కుంకుమ పూజలో పాల్గొని హారతి పూజలు అభిషేకాలు చేపట్టారు. వేద పండితులకు దక్షిణ సమర్పించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ యూత్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.