న్యాయవాదులతో కలిసి కేసుల పరిష్కారానికి కృషి: జడ్జి మాధవి

723చూసినవారు
న్యాయవాదులతో కలిసి కేసుల పరిష్కారానికి కృషి: జడ్జి మాధవి
జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో శుక్రవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పరిచయ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి వి. మాధవి పాల్గొన్నారు. కేసుల పరిష్కారంలో పరస్పర సహకారంతో ముందుకు వెళ్దామని, బార్ అండ్ బెంచ్ రిలేషన్ షిప్ పెంచుకోవడానికి తనవంతు సహకారం ఉంటుందని ఆమె తెలిపారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం కోసం న్యాయవాదులు సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్ల రాజేందర్, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్