మల్లాపూర్: కాంగ్రెస్ పార్టీ నూతన మండల అధ్యక్షునికి సన్మానం

1చూసినవారు
మల్లాపూర్: కాంగ్రెస్ పార్టీ నూతన మండల అధ్యక్షునికి సన్మానం
మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా మాట్ల సోమయ్య ఇటీవల నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం మల్లాపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘనంగా సన్మానం చేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీ సెల్ జనరల్ సెక్రెటరీ బోయిని హన్మాండ్లు, యూత్ కాంగ్రెస్ మల్లాపూర్ మండల ఇన్చార్జ్ జావిడి రాజారెడ్డిలు ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. వీరితో పాటు నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు జగిన పెళ్లి రాములు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :