మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామానికి చెందిన సుద్దు దేవరాజు లక్ష్మీకి కాంగ్రెస్ నాయకులు గురువారం కల్టివేటర్ ను అందజేశారు. ఈ కల్టివేటర్ రైతాంగానికి వ్యవసాయ పనుల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వానికి, దీనికి సహకరించిన జువ్వాడి నర్సింగరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదం గంగాధర్, ఎదులాపురం రమేష్, నత్తి రాము, ఆకుల ఎర్రన్న, జంబరత్ ప్రశాంత్ పాల్గొన్నారు.