మల్లాపూర్: ఘనంగా సీతారాముల శోభాయాత్ర

0చూసినవారు
మల్లాపూర్: ఘనంగా సీతారాముల శోభాయాత్ర
మల్లాపూర్ మండలం వేంపల్లిలో శనివారం శ్రీ సీతారాముల స్వామి వారి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని హనుమాన్ దీక్ష స్వాములు శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, హనుమాన్, శివుని వేషధారణలు ధరించి, గ్రామంలోని వీధుల గుండా శోభాయాత్ర జరిపారు. భక్తి పాటలకు నృత్యాలు చేస్తూ, భజనలు ఆలపిస్తూ, ఊరంతా సందడిగా యాత్ర సాగింది. మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్