మల్లాపూర్ మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం చిన్నారుల సమగ్ర వికాసం కోసం అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడం, సరైన పోషకాహారం అందించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్రం నిర్వాహకురాలు ఎం. రాధ, ఉప సర్పంచ్ సోమ రెడ్డి, వార్డు సభ్యులు కొంపెల్లి రాకేష్, ముష్కరి రమేష్, కదుర్కలక్ష్మి-రాజేందర్, అల్లె లత, అరికుప్పల రాజం, శనిగారపు నరేష్, ఎం. డి షబ్బీర్ పాల్గొన్నారు.