మెట్పల్లి: పట్టణ సమాఖ్యకు ఉత్తమ అవార్డు

0చూసినవారు
మెట్పల్లి: పట్టణ సమాఖ్యకు ఉత్తమ అవార్డు
హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన స్త్రీనిధి 13వ సర్వసభ్య సమావేశంలో, 2024–2025 ఆర్థిక సంవత్సరానికి వ్యాపార నిర్వహణ, రుణాల తిరిగి చెల్లింపులో ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు మెట్‌పల్లి పట్టణ స్లమ్ సమాఖ్య రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైంది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును మంత్రి సీతక్క, సంబంధిత అధికారుల చేతుల మీదుగా హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో మెప్మ సహాయ అధికారి శ్రీనివాస్ గౌడ్, పట్టణ మిషన్ సమన్వయకర్త సోమిడి శివ కుమార్, సమాఖ్య అధ్యక్షురాలు బబ్బూరి లక్ష్మి, స్త్రీనిధి నిర్వాహకురాలు గంగాజల అవార్డును అందుకున్నారు.

సంబంధిత పోస్ట్