మెట్పల్లిలో నాలుగేళ్ల బాలుడు శ్రీహర్ష మెడకు చైనా మాంజా చుట్టుకొని గాయపడిన ఘటనలో, పోలీసులు షేక్ సిద్ధిక్ హుస్సేన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిచ్చిన సమాచారం మేరకు, నిషేధిత మాంజాను సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుడు ఎండి. ఫిరోజ్ ఖాన్‌ను ఆదివారం నిర్మల్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. మెట్‌పల్లి ఎస్సై పి. కిరణ్ కుమార్ ఈ మెరుపు దాడిని నిర్వహించారు.