ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తిలో విద్యుత్ శాఖ తాత్కాలిక ఉద్యోగి సంబారి హరీష్ కరెంట్ స్తంభంపై నుండి పడి వెన్నుపూసకి గాయపడటంతో, వేములకుర్తి పంచాయతీ కార్యదర్శి గూరుడు శ్రీకాంత్ గురువారం రూ. 15000 లను హరీష్ కు అందజేశారు. ఈ సందర్భంగా మిత్రులు మాదం మహేష్, గాంధారి శ్రీకాంత్ కూడా ఉన్నారు.