మెట్పల్లి: బడుగు, బలహీన వర్గాల నాయకుడు కొమోరెడ్డి రాములు

4చూసినవారు
మెట్పల్లి: బడుగు, బలహీన వర్గాల నాయకుడు కొమోరెడ్డి రాములు
మెట్పల్లి మాజీ ఎమ్మెల్యే, సుప్రీం కోర్టు న్యాయవాది కొమిరెడ్డి రాములు జయంతి వేడుకలు బుధవారం మెట్పల్లి డివిజన్ కేంద్రంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీ బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు, మున్నూరు కాపు రాష్ట్ర సెక్రెటరీ జనరల్, సీనియర్ సిటిజెన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ, కొమిరెడ్డి రాములు ప్రజా రాజకీయాల్లో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన మహానీయుడని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులు కొమిరెడ్డి కరం చంద్, కోమిరెడ్డి విజయ్ ఆజాద్, కపిల్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్