మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి:రాష్ట్ర మున్సిపల్

842చూసినవారు
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి:రాష్ట్ర మున్సిపల్
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి, గురువారం మెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారం లింబాద్రిని కలిసి వినతి పత్రం అందించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్‌తోనూ కార్మికుల సమస్యలపై చర్చించారు. మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలని, 60 ఏళ్లు పైబడిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం ఇవ్వాలని జైపాల్ రెడ్డి కోరారు.

సంబంధిత పోస్ట్