కబడ్డీలో ప్రథమ స్థానంలో నిలిచిన నిఖిల్ భారత్ స్కూల్ విద్యార్థుల జట్టు

2చూసినవారు
కబడ్డీలో ప్రథమ స్థానంలో నిలిచిన నిఖిల్ భారత్ స్కూల్ విద్యార్థుల జట్టు
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన జగిత్యాల జిల్లా జోనల్ స్థాయి అండర్-14 బాలుర కబడ్డీ పోటీల్లో నిఖిల్ భారత్ స్కూల్ మెట్‌పల్లి విద్యార్థులతో కూడిన జట్టు ప్రథమ స్థానం సాధించింది. ఈ విజయానికి పాఠశాల విద్యార్థులు ఆరేపల్లి మౌలిక్, కట్టె అత్యుత్ రాజ్ కీలక పాత్ర పోషించారు. తమ ప్రతిభను ప్రదర్శిస్తూ జట్టు విజయంలో భాగస్వాములయ్యారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన క్రీడా ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందాన్ని ప్రిన్సిపాల్ విబి మహర్షి, ప్రధానోపాధ్యాయులు సిహెచ్ అనిత, పాఠశాల యాజమాన్యం అభినందించింది.

సంబంధిత పోస్ట్