జగిత్యాల జిల్లా, కోరుట్ల డివిజన్లోని కోమటి కొండాపూర్ గ్రామంలో శుక్రవారం పోషణ మాసంలో భాగంగా గర్భిణీలు, బాలింతలు, పిల్లల ఆరోగ్యంపై అంగన్వాడీ సూపర్వైజర్ శంకరమ్మ అవగాహన కల్పించారు. సరైన సమయంలో పోషకాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పద్మజా వెంకట్, హెచ్ఎం సుధారాణి, కార్యదర్శి మనోజ్, వివో అధ్యక్షులు జక్కని లక్ష్మి, నవ్య శ్రీ, కారోబార్ మహదేవ్, ఉపాధ్యాయులు, ఆశాలు, అంగన్వాడీ టీచర్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.