జగిత్యాల జిల్లా, కోరుట్ల పట్టణంలోని బాలకిషన్ నగర్ కాలనీ వినాయక మండపం వారి ఆధ్వర్యంలో మంగళవారం పురోహితులు రమణాచారి వేద మంత్రాలతో విగ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, స్వామివారికి 108 రకాల ప్రసాదాలతో నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మైలారపు రాము, కౌన్సిలర్ గుడి కందుల అజయ్, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ అధ్యక్షులు తోట ప్రవీణ్, ఉపాధ్యక్షులు సాంబార్ శ్రీనివాస్, కార్యదర్శి చందనగిరి రమేష్, నాగేశ్వర్ గిరి, పర్రే మిల్ట్రీ శంకర్, మర్రి మహేష్, బోలుమల్ల వినయ్ కుమార్, రమేష్, బోయిని ప్రవీణ్, సురేష్, శ్రీకాంత్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.