వెల్లుల్లలో పోచమ్మ తల్లికి బోనం సమర్పణ

0చూసినవారు
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో ఆదివారం, గ్రామదేవత పోచమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించారు. గంగపుత్రులు, గొల్లెండ్లు, పద్మశాలీలు వస్త్రాలతో అలంకరించి, డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా అమ్మవారి దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, గ్రామ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఉత్సవ నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్