మెట్‌పల్లిలో పండిత్ దీన్ దయాల్ జయంతి వేడుకలు

4చూసినవారు
మెట్‌పల్లిలో పండిత్ దీన్ దయాల్ జయంతి వేడుకలు
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో శనివారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బిజెపి రాష్ట్ర నాయకులు ఇల్లెందుల కృష్ణమాచారి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ భారతీయ రాజకీయాల్లో సామాజిక చింతనలో అత్యంత ప్రభావవంతమైన తత్వవేత్త అని, భారతీయ జనసంఘ్, బీజేపీకి ముఖ్య నాయకుడిగా భారతదేశ చరిత్రలో ప్రముఖంగా నిలిచారని, ఆయన సేవలను దేశం మర్చిపోలేదని అన్నారు.

సంబంధిత పోస్ట్