జగిత్యాల జిల్లా, కోరుట్లలోని కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో శుక్రవారం భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకుడు, ఏకాత్మ మానవ వాదం, అంత్యోదయ సిద్ధాంత కర్త పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 110వ జయంతి వేడుకలను
బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధారి శ్రీనివాస్, కాసోజి ప్రశాంత్, రాజు, కాసోజి ప్రతాప్, చింతకుంట రవి, ఎల్ల వినోద్, నవీన్, లింగేశ్వర్, మారుతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.