జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో శుక్రవారం హార్ట్ఫుల్నెస్ వారి ధ్యానోత్సవం కార్యక్రమం పోస్టర్ను మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి ఆవిష్కరించారు. నిర్వాహకులు మూడు రోజుల ఉచిత ధ్యాన శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మైలారపు రాంబాబు, పడిగెల శ్రీనివాస్, న్యాయవాది దొంతుల పవన్, అల్లకట్టు సత్యనారాయణ, మహాజన్ నవీన్, కోట జీవన్, శ్యామ్ శివానందం, కంఠాల ఆనందం, వేణు, పడిగేల శివ తదితరులు పాల్గొన్నారు.