జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పాత శాస్త్రి చౌరస్తాలో ఉన్న ఖాదీ ముందు లలిత కళా సమితి మరియు మెటుపల్లి పాత తాలూకా ప్రాంత కళాకారుల సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం రోజున మూడు రోజుల రిలే దీక్షలు ప్రారంభించారు. కొందరు నాయకుల అండదండలతో దౌర్జన్యంగా అక్రమ ఆక్రమణకు గురైన లలిత కళా సమితి సంస్థ స్థలాన్ని కాపాడుకోవటానికి చేస్తున్న పోరాటంలో భాగంగా రిలే దీక్ష చేపట్టినట్లు కళాసమితి ప్రతినిధులు తెలిపారు. మొదటిరోజు రిలే దీక్షకు బిఆర్ఎస్, టిఆర్ఎస్ సంఘీభావం తెలిపాయి. సంస్థకు న్యాయబద్ధంగా అన్ని హక్కులు ఉన్నప్పటికినీ చర్యలు తీసుకోవటంలో అధికారులు అలసత్వం వహించడం విడ్డూరంగా ఉందని అన్నారు.