
స్వల్ప ఊరట.. విశాఖకు చేరిన భారీ ఎల్పీజీ నౌక
పర్షియన్ గల్ఫ్ నుంచి విశాఖపట్నం పోర్టుకు మరో భారీ ఎల్పీజీ నౌక చేరుకుంది. 'పైన్ గ్యాస్' అనే ఈ నౌక 47 వేల టన్నుల గ్యాస్‌ను మోసుకువచ్చింది. ఒడిశాలోని దమ్రా పోర్టుకు వెళ్లాల్సిన ఈ నౌకను, తెలుగు రాష్ట్రాలలో పెరుగుతున్న గ్యాస్ డిమాండ్ మరియు నిల్వలను దృష్టిలో ఉంచుకుని విశాఖకు మళ్లించినట్లు సమాచారం. దీనితో గ్యాస్ సరఫరాలో స్వల్ప ఊరట లభించే అవకాశం ఉంది.




