మెట్ పల్లిలో రోడ్డు అధ్వానం: వాహనాలు మురికి కాలువలో పడి ధ్వంసం

606చూసినవారు
మెట్ పల్లిలో రోడ్డు అధ్వానం: వాహనాలు మురికి కాలువలో పడి ధ్వంసం
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని సిద్ది వినాయక నగర్ బ్రూక్లిన్ స్కూలుకు వెళ్లే దారి అధ్వానంగా మారింది. ప్రతిరోజూ పాదచారులు, బస్సులు, ఆటోలు, కార్లు, టూ వీలర్లు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటాయి. గుంతల కారణంగా వాహనాలు పక్కనే ఉన్న మురికి కాలువలో పడి ధ్వంసమవుతున్నాయి. ప్రమాదాల కారణంగా ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు. మున్సిపల్ అధికారుల అసమర్థత, నిర్లక్ష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, భవిష్యత్తులో జరిగే ప్రమాదాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్