జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయ అభివృద్ధి పనుల్లో భాగంగా, చింతలపల్లి రవి, గడ్డం రాజులు స్వామివారి రథయాత్ర కోసం రూ. 3 లక్షల విలువైన రథాన్ని తయారు చేయించేందుకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు. ఆలయ అభివృద్ధికి భక్తులు కూడా తమ వంతు సహకారం అందించాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.