ధర్మారం ఎంపీపీఎస్ పాఠశాలకు ఎస్.డి.ఎఫ్ నిధులు మంజూరు

69చూసినవారు
ధర్మారం ఎంపీపీఎస్ పాఠశాలకు ఎస్.డి.ఎఫ్ నిధులు మంజూరు
కోరుట్ల మండలం ధర్మారం గ్రామంలో ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి పనుల కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుండి రూ. 3 లక్షల నిధులను మంజూరు చేసినట్లు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు శుక్రవారం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి రాష్ట ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్