హిందువుల మౌనం దేశానికి ప్రమాదం: ఆరెస్సెస్ ప్రచారక్ మహేందర్

816చూసినవారు
జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో రాణా ప్రతాప్ ఆజాద్ బస్తీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కోదండరామాలయంలో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో రాష్ట్రీయ సేవా సమితి జగిత్యాల జిల్లా ప్రచారక్ ఎలికట్టే మహేందర్ మాట్లాడుతూ, దేశంలోని హిందువుల మౌనం దేశానికి ప్రమాదకరంగా మారిందని, ఇది భవిష్యత్తులో వీడాల్సిన అవసరం ఉందని అన్నారు. హిందూ మతం ధ్వంసం కావడానికి, అన్య మతస్తులు రెచ్చిపోవడానికి హిందువుల మౌనమే ప్రధాన కారణమని, ఇప్పటికైనా హిందువులు బాధ్యతతో, ఐకమత్యంతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్