మెట్‌పల్లిలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పిల్లలకు క్రీడా పోటీలు

7చూసినవారు
మెట్‌పల్లిలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పిల్లలకు క్రీడా పోటీలు
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో వాసవి క్లబ్ గ్రేటర్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎంపీపీ ఇందిరానగర్ పాఠశాలలో పిల్లలకు, పెద్దలకు క్రీడా పోటీలు నిర్వహించారు. ప్రాచీన క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు ఈ పోటీలు జరిగాయి. అనంతరం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మైలారపు రాంబాబు చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ జోన్ చైర్మన్ కోట కిరణ్ కుమార్, అధ్యక్షులు కొండూరి రాజేష్, కార్యదర్శి గుండ శివకుమార్, పాఠశాల హెడ్మాస్టర్ షేక్ తయార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్