
తమిళ బిగ్ బాస్ ఇంట్లో కంటెస్టెంట్ల మధ్య ఘర్షణ.. వీడియో వైరల్
తమిళ బిగ్ బాస్ ఇంట్లో కంటెస్టెంట్ల మధ్య జరిగిన గొడవ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఒక కంటెంట్ ప్రోగ్రామ్ జరుగుతున్న సమయంలో కమరుదిన్, ప్రవీణ్ రాజ్ అనే ఇద్దరు కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదం తీవ్రమైంది. ఇది కాస్తా దాడికి దారితీయడంతో, ఆగ్రహంతో కమరుదిన్ ప్రవీణ్ రాజ్పైకి దూసుకెళ్లారు. తోటి కంటెస్టెంట్లు జోక్యం చేసుకుని వారిని అడ్డుకున్నారు. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




