
బడ్జెట్ 2026-27.. రవాణా రంగానికి భారీ కేటాయింపులు
2026-2027 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో రవాణా రంగానికి అత్యధికంగా రూ. 5,98,520 కోట్లు కేటాయించారు. గ్రామీణాభివృద్ధికి రూ. 2,73,108 కోట్లు, రక్షణ రంగానికి రూ. 5,04,585 కోట్లు, హోం వ్యవహారాలకు రూ. 2,55,734 కోట్లు, వ్యవసాయానికి రూ. 1,62,671 కోట్లు కేటాయింపులు జరిగాయి. విద్య, సామాజిక సంక్షేమం, ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, ఐటీ, వాణిజ్య, శాస్త్రీయ, పన్నుల పరిపాలన, విదేశాంగ, ఆర్థిక శాఖలకు కూడా నిధులు కేటాయించారు. ఉత్తర తూర్పు రాష్ట్రాల అభివృద్ధికి రూ. 6,812 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు.




