రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి

0చూసినవారు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి
జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశించారు. గత మూడు నెలలుగా జరిగిన ప్రమాదాలపై సమగ్ర విశ్లేషణ చేసి ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్‌పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, బ్లాక్ స్పాట్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించేలా అవగాహన కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్