జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వెంకట్రావుపేట వార్డుకి చెందిన బత్తుల స్వప్న గ్రూప్ 2లో విజయం సాధించి నిజామాబాద్‌లో శిక్షణ పూర్తి చేసుకుని జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో డిప్యూటీ తహసీల్దార్‌గా బుధవారం బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా మెట్పల్లి పట్టణంలోని 11వ వార్డు కౌన్సిలర్ రెబ్బాస్ మహేష్ ఆమెను ఆమె తండ్రి బత్తుల శంకర్‌ను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా రెబ్బాస్ మహేష్ మాట్లాడుతూ బత్తుల స్వప్న సాధించిన విజయం వెంకట్రావుపేట గ్రామానికి గర్వకారణమని ఆమె కృషి పట్టుదల మరెందరో యువతీ యువకులకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.