వృద్ధులకు ఆసరాగా టాస్కా

10చూసినవారు
వృద్ధులకు ఆసరాగా టాస్కా
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 15వ ప్రపంచ వృద్ధుల వేధింపుల నిరోధక అవగాహన దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. మెట్‌పల్లి డివిజన్ శాఖ అధ్యక్షులు వొజ్జెల బుచ్చి రెడ్డి ఆధ్వర్యంలో బ్రహ్మంగారి గుడి ఆవరణలో జరిగిన  కార్యక్రమంలో, వృద్ధులపై వేధింపులు అరికట్టాలనే నినాదాలతో సీనియర్ సిటిజెన్స్ ర్యాలీ చేపట్టారు. సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాది హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ, వృద్ధులకు టాస్కా ఆసరాగా ఉందని తెలిపారు.
Job Suitcase

Jobs near you