
సౌదీలోని అమెరికా ఎయిర్‌బేస్‌పై ఇరాన్ దాడి
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో, ఇరాన్ సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది. ఈ దాడిలో 10 మంది అమెరికన్ సైనికులు గాయపడ్డారని, కొన్ని సైనిక విమానాలు ధ్వంసమయ్యాయని సమాచారం. మిస్సైళ్లతో పాటు మానవరహిత డ్రోన్లతో కూడా దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అమెరికా, సౌదీ ప్రభుత్వాల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.




