జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నుండి రాత్రి 9 గంటల వరకు మెట్ పల్లి కాశి బాగ్ హనుమాన్ మందిరం నుండి అయ్యప్ప స్వామి మందిరం వరకు వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ ఘనంగా జరిగింది. హనుమాన్ దీక్ష సాములు, ప్రజలు, విశ్వహిందూ పరిషత్ మరియు బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు మరియు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు.