మెట్‌పల్లిలో అట్టహాసంగా వినాయక నిమజ్జన వేడుకలు

3చూసినవారు
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో బుధవారం వినాయక నిమజ్జన వేడుకలు ప్రారంభమయ్యాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా, మున్సిపల్ అధికారులు నిమజ్జనం వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. వైఎస్ఏ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంప్రదాయ ప్రదర్శనలు, వివిధ కళాకారుల ప్రదర్శనలు, డోలు వాయిద్యాలు, భక్తి గీతాలతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. వినాయక శోభాయాత్రను చూడటానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్