మెట్ పల్లి శివాలయంలో మహిళల ఘన దీపారాధన

0చూసినవారు
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ఓంకారేశ్వర శివాలయంలో బుధవారం రాత్రి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వారు దీపాలు వెలిగించి, ఉసిరి దీపాన్ని పేద పండితులకు సమర్పించారు. శివునికి పాలాభిషేకం చేసి, పండ్లు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. దీపారాధనతో గుడి ప్రాంగణం కాంతివంతంగా మారింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you