రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో సోమవారం సిపిఐ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జంగం అంజయ్య (55) తన పొలం వద్ద విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. పొలం పనులు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో ఈ ఘోరం జరిగింది. రైతు సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే నాయకుడిగా అంజయ్యకు మంచి పేరుంది. ఈ వార్త మండల వ్యాప్తంగా విషాదాన్ని నింపింది.