సెక్రటేరియట్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, KTR, హరీశ్ రావులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'మీ అవినీతి చిట్టా అంతా ప్రభుత్వం దగ్గర ఉంది. త్వరలో అన్నీ బయటకు వస్తాయి. మీ తాటాకు చప్పుళ్లకు భయపడం.. ఖబడ్దార్' అని హెచ్చరించారు. నాదర్‌గుల్ భూముల్లో వాటా దక్కకపోవడం వల్లే హరీశ్ తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వట్టినాగులపల్లి భూములతో తన కొడుకుకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.