వేములవాడలో తీవ్ర విషాదం

847చూసినవారు
వేములవాడలో తీవ్ర విషాదం
వేములవాడ రూరల్ మండలంలోని మరిపల్లిగ్రామ శివారులో ఉన్న ఓ రైస్ మిల్ వద్ద, మిల్లు యజమాని బయట పడేసిన కుళ్లిపోయిన బియ్యాన్ని తిన్న 40 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో 30 గొర్రెల పరిస్థితి విషమంగా ఉంది. మరణించిన గొర్రెలు జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని తండ్రియాల, గంభీర్పూర్ గ్రామాలకు చెందిన గొర్రెల కాపరులవిగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సంగ స్వామి యాదవ్ బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్