ఖైదీతో జైలు సూపరింటెండెంట్ ప్రేమ.. ఘనంగా వివాహం

112చూసినవారు
ఖైదీతో జైలు సూపరింటెండెంట్ ప్రేమ.. ఘనంగా వివాహం
మధ్యప్రదేశ్‌లోని సత్నా కేంద్ర కారాగారంలో సహాయ జైలు అధికారిగా పనిచేస్తున్న ఫిరోజా ఖాతూన్, అదే జైలులో జీవిత ఖైదు అనుభవించి విడుదలైన మాజీ ఖైదీ ధర్మేంద్ర అలియాస్ అభిలాష్‌ను హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. హత్య కేసులో 14 ఏళ్లు శిక్ష అనుభవించి 2020లో విడుదలైన ధర్మేంద్రతో జైలులోనే ఫిరోజాకు పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారిందని తెలిసింది. మత బేధాలను పక్కనపెట్టి ఒక్కటైన ఈ జంట తమ నిర్ణయంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. ఈ అరుదైన ప్రేమకథ, వివాహం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్